26 June, 2026 | 1:56 AM

అంత్యోదయ అన్నయోజనలో మార్పులు

26-06-2026 12:40 AM
  1. ప్రతీ వ్యక్తికి 7 కిలోలు, 35 కేజీల పరిమితి కొనసాగింపు
  2. జూలై 13న ప్రజాభిప్రాయం సేకరించనున్న కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ, జూన్ 25: అంత్యోదయ అన్నయోజన (ఏఏవై)లో కేంద్ర ప్రభుత్వం కీలకమార్పులు చేయనుంది. ఈ పథకం ద్వారా ఒక్కో లబ్ధిదారునికి 7 కిలోల ఆహార ధాన్యాలు అందించేలా చర్యలు తీసుకో నుంది. అంత్యోదయపై గరిష్ఠంగా 35 కిలోల పరిమితిని కొనసాగించనుంది. జాతీయ ఆహార భద్రత చట్టం-2013ను సవరించాల ని కేంద్రం భావిస్తోంది. జూలై 13న ప్రజాభి ప్రాయ సేకరణ చేపట్టనుంది.

అంత్యోదయ అన్నయోజన కింద కేంద్ర ప్రభుత్వం పేదరి కంలో ఉన్న కుటుంబాలకు సభ్యుల సంఖ్య తో సంబంధం లేకుండా గరిష్ఠంగా 35 కేజీలను ఉచితంగా పంపిణీ చేస్తుంది. తెల్ల రేషన్ కార్డుపై మాత్రం ఒక్కో వ్యక్తికి 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాలను అందజేస్తుంది. పేదరికంలో ఉన్న ప్రతీ ఒక్కరికి ఆహార ధాన్యాలను పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్య మని, ఈ సవరణ ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.