26 June, 2026 | 2:27 AM

అనుచిత వ్యాఖ్యలపై రాహుల్ విచారం

26-06-2026 12:38 AM
  1. భోపాల్ హైకోర్టులో విచారణ రద్దు చేయాలని పిటిషన్
  2. క్షమాపణలు చెప్పడం రాహుల్‌కు మామూలేనన్న బీజేపీ

భోపాల్, జూన్ 25: అనుచిత వ్యాఖ్యల కేసులో ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గురువారం విచారం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలు కార్తికేయ సింగ్‌ను ఉద్దేశించి చేయలేదని పేర్కొన్నారు. ఈ కేసులో తనపై వేసిన పిటిషన్, విచారణను రద్దు చేయాలని కోరుతూ భోపాల్ హైకోర్టును ఆశ్రయించారు. 2018లో మధ్యప్రదేశ్ ఝబువాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ కుమారుడు, కార్తికేయ సింగ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

దీంతో కార్తికేయ ఎంపీ, ఎమ్మెల్యే కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు సమన్లు జారీచేసింది. కేసు గురువారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ న్యాయవాదుల తరఫున దాఖలు చేసిన పిటిషన్‌లో విచారణం వ్యక్తం చేస్తూ, కేసు కొట్టివేయాలని అభ్యర్థించారు. కాగా రాహుల్ గాంధీ తీరుపట్ల బీజేపీ ఐటీసెల్ చీఫ్ అమిత్ మాల్వి యా తీవ్రంగా స్పందించారు. ఆయనకు  క్షమాపణలు చెప్పడం పరిపాటిగా మారిందన్నారు.