22 March, 2026 | 1:28 AM

వనపర్తిలో మారుతున్న హస్తరేఖలు

22-03-2026 12:02 AM

డీసీసీ రాకతో వర్గ పోరుకు చెక్  

ఒక్కటిగా ముందుకు సాగుతున్న ముగ్గురు నేతలు 

వనపర్తి, పెబ్బేరు మున్సిపాలిటీల్లో హస్తగతం

2023 అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి వనపర్తి కాంగ్రెస్‌లో ప్రస్తుత రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి ల మధ్య సయోధ్య కుదరక వర్గ పోరు కాంగ్రెస్ అధిష్టానం వరకు ఫిర్యాదులు వెళ్లిన సంగతి అందరికి తెలిసిందే. రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డీ వనపర్తి జిల్లా డీసీసీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత అటు చిన్నారెడ్డి, ఇటు మేఘారెడ్డిలతో ఉన్న సన్నిహితంతో ఇద్దరిని కలుపుకుంటూ రెండు వర్గాలు కాదు ఉన్నది ఒక్క వర్గం ఆది కాంగ్రెస్ వర్గమంటూ ముందుకు సాగుతు ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో ముగ్గురు ఒక్కటై అభ్యర్థులకు బీ ఫామ్ లను అందచేసి మున్సిపాలిటీ పీఠంపై కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు.

వనపర్తి, మార్చి 21 (విజయక్రాంతి) : వనపర్తి కాంగ్రెస్ అంటేనే గతంలో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షలు చిన్నారెడ్డి అటు నాయకులకు ఇటు నియోజకవర్గ ప్రజలకు సుపరిచితమే. 2023 ఎన్నికల ముందు తూడి మేఘారెడ్డి బీఆర్ ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే టికెట్ ను స్వంతం చేసుకుని స్థానిక నాయకుల మద్దత్తుతో గెలుపొందారు. వనపర్తి కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే మేఘారెడ్డి, ప్రస్తుత రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షలు చిన్నారెడ్డిల మధ్య సయోధ్య కుదరక వర్గ పోరు కాంగ్రెస్ అధిష్టానం వరకు ఫిర్యాదులు వెళ్లిన సంగతి సైతం అందరికి తెలిసిందే.

డీసీసీఈ రాకతో వర్గ పోరుకు చెక్..

శివ సేనా రెడ్డీ రాష్ట్ర యూత్ అధ్యక్షునిగా పదవి భాద్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ అందరిని కలుపుకుంటూ పోతూ రాష్ట్ర స్థాయిలో పార్టీ ఏ పిలుపునిచ్చిన విజయవంతం దిశగా ముందుకు సాగాడు. ఈ నేపథ్యంలో రాష్టంలో కాం గ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్ర స్పోరట్స్ అథారిటీ చైర్మన్ పదవి ఇచ్చారు. కాగా వనపర్తి నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న అధి నాయక త్వం డీసీసీగా ప్రకటించింది.నువ్వా నేనా అన్నట్లుగా ఉన్న వనపర్తి రాజకీయంలో శివసేనా రెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా రావడంతో ఇద్దరిని కలుపుతాడా లేక  మూడవ వర్గంగా మారు తుందా వనపర్తి నియోజకవర్గం మొత్తం హాట్ టాపిక్‌గా చర్చ జరిగింది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉండ వు ఉన్న ఆది ఒక్క కాంగ్రెస్ గ్రూప్ అని పదవి భాద్యత స్వీకరణ రోజు శివసేనారెడ్డి ప్రస్థావించినట్లు అనతి కాలంలోనే ఇద్దరిని ఒక్కటి చేసి అందరిని కలుపుకుంటూ పోతూ వర్గ పోరుకు చెక్ పెట్టారు.ఎమ్మెల్యే మేఘారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సం ఘం ఉపాధ్యక్షలు చిన్నారెడ్డిలతో శివసేనారెడ్డ్డికి ఉన్న సన్నిహితంతో వారిని ఒక్కటిగా చేసి వనపర్తి నియోజకవర్గంలో ఉన్న ది ఒక్కటే గ్రూప్ ఆది కాంగ్రెస్ పార్టీ గ్రూప్ అన్నట్లుగా చేయ డం జరిగిందని నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో ఐక్యత ఫలితం..

ఇటీవల నియోజకవర్గం లో జరిగిన వనపర్తి, పెబ్బేరు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఈ ఐక్యత స్పష్టంగా కనిపించింది. ముగ్గురు నాయకులు కలిసి అభ్యర్థులకు బీ-ఫార్మ్లు అందించి,  ప్రచారం నిర్వహించారు. దాని ఫలితంగా రెండు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని నమోదు చేసి పీఠాలను కైవసం చేసుకుంది.

క్యాడర్‌లో పెరిగిన ఉత్సాహం..

వర్గ రాజకీయాలకు బ్రేక్ పడటంతో పార్టీ క్యాడర్‌లో కొత్త ఉత్సాహం నెలకొంది. నాయకత్వం ఐక్యంగా ముందుకు సాగుతుండటంతో, భవిష్యత్ లో కాంగ్రెస్ బలోపేతానికి ఇది దోహదం చేస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.