12 March, 2026 | 10:52 AM

సంపన్న మిత్రుని లక్షణాలు

11-03-2026 12:00 AM

పాలకుర్తి రామమూర్తి :

సమసంధౌతు యః సంపన్నం 

మిత్రం మిత్రకృఛ్ఛ్రే వా మిత్రమ్

అవాప్నోతి సోతినంధత్తే.. 

ఆపద్ధి సౌహృదస్థైర్యముత్పాదయతి!

(కౌటిలీయం  79)

సమసంధిలో (సమాన బలవంతుల మధ్య సంధి లేదా సమానమైన లాభం ఉండే సంధిలో) ఎవరైతే ఆపత్సమయంలో సంపన్నుడైన, అనగా మైత్రికి అవ సరమైన గుణాలన్నీ కలిగిన మిత్రుడిని పొందుతాడో,లేదా మిత్రసంపద కలిగిన వాడిని మిత్రునిగా పొందుతాడో అతడు అతిసంధి (లాభకరమైన సంధి) చేసుకొన్న వాడవుతాడు.

ఆపద స్నేహానికి స్థైర్యాన్ని కలిగిస్తుంది అంటాడు ఆచార్య చాణక్య. ఉన్మాదం తలకెక్కి విచక్షణ కోల్పోయిన పాలకుల అనాలోచిత నిర్ణయాలు, అహంకార పూరిత ఆధిపత్య ధోరణలు, స్వార్థభరిత నిర్ణయాలు దే శాల మధ్య అపార్థాలకు,యుద్ధాలకు దారితీస్తాయి. యుద్ధాలు, ఘర్షణలు ప్రజాజీవితా న్ని అతలాకుతలం చేస్తాయి. అమాయక ప్రజలెందరో నిర్జీవులౌతారు, నిరాశ్రయులౌతారు. ఉత్పత్తిరంగం కుదేలవుతుంది.

ప్రపం చ ఆర్థికవ్యవస్థ స్తంభిస్తుంది. ద్రవ్యోల్బణం పెరిగిపోయి సాధారణ ప్రజాజీవితాలు అస్తవ్యస్తమవుతాయి. విజ్ఞత గలిగిన పాలకులే అలాంటి దుష్పరిణామాలు తొలగించ గలుగుతారు. ఒకదేశ ప్రతిష్ఠ ఆ దేశ పాలకపక్ష, ప్రతిపక్షాల మధ్య సదవగాహన, దేశభక్తి ప్రాతిపదికన నిలుస్తుంది. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య జరుగుతున్న యుద్ధంగూర్చి ఇజ్రాయెల్ ప్రతిపక్ష నేతను ప్రఖ్యాత పాత్రికేయుడు రాజదీప్ సర్దేశాయ్ ప్రశ్నిస్తే.. నేను నా ప్రతిపక్షపార్టీ, దేశం.. మొ త్తం ప్రభుత్వంతో నిలుస్తున్నాము అని చెప్ప డం విశేషం.

ప్రభుత్వ ప్రతిపక్షాల మధ్య రాజకీయ వైరుధ్యం రాజకీయాలకే పరిమితం కావాలి కానీ, దేశప్రయోజనాలకు, ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా ఉండకూడదు. దురదృష్టవశాత్తు భారతదేశ ప్రతిపక్ష నాయకుడు కష్టకాలంలో కూడా దేశ ప్రతిష్ఠను దిగజార్చే విధంగా అంతర్జాతీయ వేదికలపై మాట్లాడడం శోచనీయమే.

సాంకేతిక ప్రగతి పరిణామ క్రమంలో దేశాల మధ్య యుద్ధాలు తమ రూపాన్ని మార్చుకుంటున్నాయి. ఇప్పుడు గగనతలం వేదికగా శత్రువుల స్థావరాలను ఛేదించడం, ఆర్థిక మూలాలను దెబ్బతీయడం, యుద్ధనీతిగా మారింది. సైనిక సంఘర్షణలతో సమస్యలు పరిష్కారం కావు. చర్చల ద్వారా మాత్రమే శాంతి సాధ్యపడుతుంది. శాంతి కోసం చేసే ప్రతి ప్రయత్నాన్ని సమర్ధించే వాడే ఉత్తమమైన నాయకునిగా చరిత్రలో నిలుస్తాడు.

పాలల్లో మీగడ ఎలాగైతే పైకి తేలుతుందో.. అలాగే ధైర్యసాహసాలతో నిర్ణయాలు తీసుకోగలిగిన వ్యక్తి నాయకునిగా ఎదుగుతాడు. సంధి సంబంధిత వ్యవహారాలను నడపగలుగుతాడు. సంధి కుదరక యుద్ధం అనివార్యమయిన సమయంలో మిత్రుల సహాయ సహకారాలు అవసరమౌతాయి. ఆ క్రమంలో మిత్రుల లక్షణాలను చెపుతున్నాడు ఆచార్య చాణక్య. కౌటిలీయం లో చాణక్య.. నిత్యుడు, వశ్యుడు, లఘూత్థానుడు (కొంచెం ప్రయత్నిస్తే అనుకూలంగా మారేవాడు), పితృపైతామహుడు, గొప్పవా డు, అద్వైధ్యిడు అంటూ సంపన్నమిత్రుని ఆరు లక్షణాలను చెప్పాడు.

ఏ ప్రయోజనా న్నీ ఆశించకుండా రక్షించే మిత్రుడు నిత్యమిత్రుడు. అలాంటి మిత్రులే బహునాళ్లుగా వృద్ధి పొందిన సంబంధాలను కొనసాగిస్తారు. వశ్యుడు సైన్యాన్ని, ధనాన్ని ఇచ్చి శత్రువుల నుంచి కలిగే ఆపదలు, అపాయా ల నుండి రక్షణ కల్పిస్తారు. మిత్ర సంపదను గూర్చి చెబుతూ చాణక్య, మిత్రులలో ఉన్నతులను గూర్చిన వివరణ నిచ్చాడు. 

తన అధీనంలో లేకపోయినా మైత్రిని కొనసాగించేవాడు నిత్యమిత్రుడు, తనకు అ ధీనంలో ఉండి మైత్రిని నెరిపేవాడు అనిత్యమిత్రుడు అంటూ.. ఆపత్సమయంలో తన అధీనంలో ఉండే అనిత్యమిత్రుడే శ్రేయస్కరుడు అంటాడు చాణక్య. దానికి కారణం చెపుతూ.. ఉపకారం చేయడమే మిత్రలక్షణం కాబట్టి ఏ ఉపకారమూ చేయని నిత్యమిత్రుని కన్నా ఉపకారం చేసినంత కాలమే మిత్రునిగా ఉండే అనిత్యమిత్రుడే శ్రేయస్కరుడు అంటాడాయన.

అయితే.. అనిత్యమి త్రుని నుంచి ఎక్కువ సహాయాన్ని తీసుకుం టే.. ఇంకా వీనికి ఉపకారం చేస్తూనే ఉండాలనే భావనను పొందిన అనిత్యమిత్రుడు దూరమయ్యే అవకాశం ఉంటుంది. మరొక ఉదాహరణలో.. మిత్రుడు దూరంగా ఉంటా డు కాని బలమైనవాడు.. ఎక్కువ ప్రయత్నం చేసైనా సైన్యాన్ని సిద్ధం చేయగలుగుతాడు..

అతని వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందా లేక బలహీనమైన వాడయినా, కొద్ది సైన్యా న్ని మాత్రమే సన్నద్ధం చేయగలిగినా అవసరం వచ్చినప్పుడు సమయం మించిపో కుండా అవసరానికి ఆదుకోగలిగిన వాడు ఎక్కువగా ఉపయోగపడతాడా అనేదానికి సమయం మించిపోకుండా అవసరానికి ఆ దుకోగలిగిన వాని వల్లే ప్రయోజనం ఉంటుంది అంటాడు చాణక్య. అంతేకాదు, దు ర్బలుడైన వాడిని ఇష్టం వచ్చినట్లుగా వాడుకునే అవకాశం ఉంటుంది.

బలవంతుడైన వాడు దూరంగా ఉండడం వల్ల తక్షణావసరాలకు ఉపయోగపడడు. మిత్రుని సైన్యం అతని వశంలోనే ఉన్నా.. అది వేరే కార్యంలో నిమగ్నమై ఉన్నది. అలాంటి మిత్రునికన్నా సైన్యం తన వశంలో లేని మిత్రుడు ఉండడమే మంచిది. ఎందుకంటే.. వశంలో లేక పోయినా అందుబాటులో ఉన్న సైన్యాన్ని సామదాన భేదదండోపాయాల చేత వశం చేసుకోవచ్చునే కాని మరొక కార్యంలో లగ్నమైన సైన్యాన్ని ఒకచోటికి చేర్చడం కష్టసా ధ్యం అంటాడు చాణక్య.

అలాగే అవసరానికి డబ్బునిచ్చే మిత్రుడు, సైన్యాన్ని పంపే మిత్రుల మధ్య డబ్బునిచ్చే మిత్రుని ఎన్నుకోవడమే ఉత్తమమంటాడు. ధనం తనతోటే ఉంటే అవసరమైనప్పుడు సైన్యం తన వద్దకే వస్తుంది. అంతేకాదు, ధనం కన్నా భూమిని అవసరమైతే వాడుకోనిచ్చే మిత్రుని పొంద డం ఉత్తమోత్తమం అంటారాయన. మిత్రదేశాల స్థావరాలలో అమెరికా వైమానిక స్థావ రాలను ఏర్పాటు చేసుకోవడం ఇందుకు ఉదాహరణ.

విత్తనం చాలాకాలానికి వృక్షమయి ఫలాలు ఇచ్చినట్లుగా దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు సాగడం మంచిదే కాని దానికి ఏ విఘాతాలూ లేకుండా ఉం డాలి. ఈనాటి కాలంలో మారుతున్న సాంకేతిక విజ్ఞానం,మారుతున్న దేశాధినేతల స్వా ర్థపరత,సంకుచిత మానసిక స్థితులు విఘ్నాలుగా ప్రభవిస్తాయని భావించినప్పుడు మా త్రం త్వరగా లభించే కొద్దిపాటి లాభాన్ని పొందడమే మంచిది.

ప్రజాక్షేమాన్ని దృ ష్టిలో పెట్టుకున్న నాయకుడు అవసరమైతే తన ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా సంధికైనా, సంఘర్షణకైనా సన్నద్ధం కావాలంటాడు, చాణక్య. ఎలాగైతే నీరు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఏదో మార్గాన ముం దుకు సాగుతుందో.. అలాగే వ్యక్తిలోని ధై ర్యం కూడా ముందుకు సాగేందుకు అవసరమైన మార్గాలను వెతుక్కుంటుంది.

క్రియా శీలియైన వానికే భగవంతుడు కూడా సహాయపడతాడు. నిజానికి కర్రను ఒకవైపు ప ట్టుకుంటే మరొకవైపున పట్టుకున్నట్లే.. ఒకవైపు సంఘర్షణ ఉంటే మరొకవైపు శాంతి ఉన్నట్లే.. దానిని గుర్తించి ఆవైపును పట్టుకోగలగడమే విజ్ఞత. ఆ విజ్ఞత గలిగిన నాయ కుడే ప్రజలను సక్రమ మార్గంలో నడపగలడు.