17 April, 2026 | 3:15 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

హిరపూర్ ప్రజల రేషన్ కష్టాలకు చెక్

23-02-2026 04:32 PM

వచ్చే నెల నుండి గ్రామంలోనే పంపిణీ

కుమ్రంభీంఆసిఫాబాద్,(విజయక్రాంతి): హిరపూర్ గ్రామ ప్రజల చిరకాల వాంఛ నెరవేరనుంది. రేషన్ సరుకుల కోసం కిలోమీటర్ల కొద్దీ ప్రయాణించాల్సిన అవసరం లేకుండా, వచ్చే మార్చి నెల నుండి గ్రామంలోనే రేషన్ పంపిణీ చేసేలా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

​హిరపూర్ గ్రామస్థులు రేషన్ తీసుకోవడానికి ప్రస్తుతం 2 నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసిఫాబాద్‌కు వెళ్లాల్సి వస్తోంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ సుదీర్ఘ ప్రయాణం ప్రజలకు, వృద్ధులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ గ్రామస్థులు సోమవారం 9వ వార్డు కౌన్సిలర్ సాలం బిన్ అహ్మద్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ రియాజ్ కి వినతిపత్రం సమర్పించారు. ​

ప్రజల విజ్ఞప్తిపై ఎంఆర్ఓ రియాజ్ తక్షణమే స్పందించారు. సంబంధిత రేషన్ డీలర్ రావుల పాండురంగను పిలిపించి మాట్లాడారు. మార్చి నెల నుండి హిరపూర్ ప్రజలకు వారి గ్రామంలోనే రేషన్ సరుకులు అందేలా చర్యలు చేపట్టాలని డీలర్‌ను ఆదేశిస్తూ హామీ ఇచ్చారు. తమ సమస్యను పరిష్కరించిన ఎంఆర్ఓ కి ఇందుకు కృషి చేసిన కౌన్సిలర్ సాలం బిన్ అహ్మద్‌కు హిరపూర్ గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.