17 June, 2026 | 12:23 PM

Breaking News

కేజీబీవీ తిమ్మాజిపేట స్పెషల్ ఆఫీసర్ పై బదిలీ వేటు.!   •   అభిమానిని పరామర్శించిన పవన్ కళ్యాణ్   •   ఆరుట్ల గ్రామం తెలంగాణకే ఆదర్శం, స్ఫూర్తి: సీఎం రేవంత్   •   రాష్ట్రవ్యాప్తంగా 'తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు' నిర్మిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు   •   SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే   •   విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •  

కార్మిక శాఖలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి

23-02-2026 04:35 PM

ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కె. హరితకు వినతిపత్రం సమర్పించారు. జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ కార్మిక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, కార్మికులకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సంక్షేమానికి సంబంధించిన పథకాలను వేగంగా అమలు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కార్మికులు దివాకర్, తులసిరామ్, మోహన్, ప్రకాష్ పాల్గొన్నారు.