17 April, 2026 | 2:04 PM

Breaking News

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •   ఉద్యోగుల ప్రధాన సమస్యలపై నిరసన ప్రదర్శన   •   కామారెడ్డి జిల్లాలో ఏసీబీ సోదాలు.. అస్వస్థతకు గురైన ఎక్సైజ్ సీఐ   •  

గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం పెంచాలి

23-02-2026 04:30 PM

సిఐటియు నుంచి ఐఎఫ్టియులో భారీగా చేరికలు

ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు సునారికారి రాజేష్

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం కడం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ వర్కర్లు సిఐటియు నుండి ఐఎఫ్టియులో భారీగా చేరుతున్నారని ఆ శాఖ జిల్లా అధ్యక్షులు సునారికారి రాజేష్ అన్నారు. ఈ మేరకు సోమవారం కడం మండలంలో కార్మికుల పక్షంగా ఆయన మాట్లాడారు.

కాగా గ్రామపంచాయతీ వర్కర్లకు చాలీచాలని వేతనాలు ఇవ్వడంతో వారి బ్రతుకులు చిద్రమవుతున్నాయని కనీస వేతనం 26,000 ఇవ్వాలని ,ఉద్యోగ భద్రత, పిఎఫ్, ఈఎస్ఐ చట్టాలను ప్రభుత్వం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ శాఖ జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం లింగన్న, మండలాధ్యక్షులు గొర్రె నరేష్, ఉపాధ్యక్షులు రామడుగు లక్ష్మణ్, మిరియాల మహేష్ ,ప్రధాన కార్యదర్శి శనిగారపు రాజన్న ,మంగి గణపతి, రమేష్ ,పోశం , శ్రీనివాస్, మొగిలి, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.