15 July, 2026 | 2:38 AM

మాజీ క్రికెటర్‌పై చిరుత దాడి

26-04-2024 12:13 AM

హరారే: జింబాబ్వే మాజీ క్రికెటర్ గయ్ విట్టాల్‌పై చిరుత దాడికి పాల్పడడం కలకలం రేపింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడిని తన పెంపుడు శునకం కాపాడడం గమనార్హం. ప్రస్తుతం విట్టాల్ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. 51 ఏళ్ల గయ్ విట్టాల్ గురువారం తన పెంపుడు శునకం చికారాతో కలిసి హ్యూమానీ ప్రాంతంలో ట్రెక్కింగ్‌కు వెళ్లాడు. పర్వతారోహణ సమయంలో హఠాత్తుగా వచ్చిన ఒక చిరుత విట్టాల్‌పై దాడికి దిగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అతడి పెంపుడు శునకం తన యాజమానిని కాపాడేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో చికారా తీవ్రంగా గాయపడి రక్తమోడుతున్నప్పటికి పోరాడి విట్టాల్‌ను రక్షించింది. 1992 మధ్య కాలంలో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన గయ్ విట్టాల్ జింబాబ్వే తరపున 46 టెస్టులు, 147 వన్డేలు ఆడాడు.