15 July, 2026 | 2:31 AM

అథ్లెటిక్స్‌లో పతకాల పంట

26-04-2024 12:18 AM

న్యూఢిల్లీ: అండర్20 ఏషియన్ అథ్లెటిక్స్‌లో భారత అథ్లెట్ల హవా కొనసాగు తోంది. 3వేల మీటర్ల స్టీపుల్‌చేజ్ ఈవెంట్‌లో మహిళా అథ్లెట్ ఎక్తా దే.. 10:31.92 సెకన్లలో రేసును పూర్తి చేసి  స్వర్ణంతో మెరవగా.. పురుషుల విభాగం నుంచి రన్వీర్ సింగ్ (9:22.62 సెకన్లు) కూడా స్వర్ణం గెలుచుకున్నాడు. అంతకముందు అనురాగ్ ఖేల్కర్ షాట్‌పుట్‌ను 19.23 మీటర్ల దూరం విసిరి స్వర్ణం నెగ్గాడు. దీంతో భారత్ ఖాతాలో మూడు స్వర్ణాలు చేరినట్లయింది. షాట్‌పుట్ లో సిన్హూన్, సిద్దార్థ్‌లు వరుసగా రజత కాంస్యాలు గెలుచుకున్నారు. మహిళల 10వేల మీటర్ల వాకింగ్ రేసులో అథ్లెట్ ఆర్తీ గమ్యాన్ని 47:45.33 సెకన్లలో పూర్తి చేసి కాంస్యం నెగ్గింది. పురుషుల 400 మీటర్లలో అమన్ చౌదరీ కాంస్యం ఖాతాలో వేసుకున్నాడు.