14 April, 2026 | 5:13 PM

Breaking News

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •  

ఎమ్మెల్యే పల్లా సహకారంతో అభివృద్ధికి పాటుపడతా

02-02-2026 12:07 AM

చేర్యాల మునిసిపల్ 10వ వార్డు బీఆర్‌ఎస్ అభ్యర్థి మేడిశెట్టి ఉమాశ్రీధర్

చేర్యాల,ఫిబ్రవరి 1: చేర్యాల మునిసిపాలిటీలోని 10వ వార్డు కౌన్సిలర్ గా బిఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మెడిశెట్టి ఉమా శ్రీధర్ ఆదివారం ఆమె పట్టణంలోని 10వవార్డులో ఇం టింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కారు గుర్తు మీద ఓటు వేసి తనను గెలి పించాలని వార్డులోని ఓటర్ లను కలుస్తూ ఓటును అభ్యర్థించారు. వార్డులోని సమస్యలు తెలుసు కుంటూ వార్డును అన్ని విధాలుగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సహకారంతో అభివృద్ధి చేస్తాను అని వార్డును అన్ని విధాలుగా ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని అన్నారు.

10వ వార్డులో ఉన్న ప్రతి వాడకు డ్రైనేజీ సదుపాయం కల్పించడం అవసరమైతే ఎమ్మె ల్యే కృషితో అండర్ డ్రైనేజీ కొరకు కృషి చేయడం అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందేలా కృషి చేయడం అర్హులైన పేదవారికి ఇల్లు మంజూరు చేయించడం మన వార్డులో ఎక్కడైతే నీటి ఎద్దడి తీవ్రంగా ఉందో అక్కడ పరిశీలించి బోర్లు వేయించడం నీటి ఎద్దడి,కరెంట్ తీవ్రంగా ఇబ్బందులుగా ఉన్నచోట కొత్త ట్యాంకులను నిర్మించడం పాత వాటిని పునరుద్ధరించడం కోసం కృషి చేయడం ప్రభుత్వం పేదలకు అందించే వివిధ పథకాలను మన వార్డులో కూడా అర్హులందరికీ అందేలా కృషి చేయడం డ్వాక్రా సంఘాలను బలోపేతం చేయడం వారికి రుణాలు అందించడం కోసం కృషి చేయడం నిరుద్యోగ యువతకు వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలు అందించడం కోసం కృషి చేయడం వార్డులో సౌకర్యాల కోసం ఏ విధమైన సమస్య వచ్చిన తక్షణమే స్పందించడం దానికి తగినట్లుగా పని చేయించడం జరుగుతుందని ప్రజాసేవ చేయడానికే తాను రాజకీయాలలోకి వచ్చామన్నారు. పదవీలోఉన్నా,లేకపోయినా ప్రజలను ఎన్నడూ వీడలేదని, ఎవరికి కష్టం వచ్చినా, ఆపద వచ్చినా ఆదుకున్నామన్నారు.