02-02-2026 12:04:39 AM
రేగోడు, ఫిబ్రవరి 1: కేసీఆర్ పై సీట్ విచారణ పేరుతో కక్ష సాధింపు చర్యకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బుచ్చయ్య అన్నారు. ఆదివారం బిఆర్‌ఎస్ నాయకులు మండల కేంద్రమైన రేగోడు లోని గాంధీ విగ్రహం వద్ద బిఆర్‌ఎస్ పార్టీ మండల నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం సీట్ విచారణ పేరుతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆయన అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమైందని దీయపట్టారు. రైతుబంధు వేయకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బుచ్చయ్య, ప్రధాన కార్యదర్శి రమేష్, బిఆర్‌ఎస్ పార్టీ రేగోడు గ్రామ అధ్యక్షులు రాచోటి సుభాష్ పటేల్, మాజీ కోఆప్షన్ సభ్యులు మొయిజుద్దీన్, మాజీ పిఎసిఎస్ చైర్మన్ రాజు యాదవ్, బిఆర్‌ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు వినోద్ కుమార్, మాజీ ఎంపిటిసి గొల్ల నర్సింలు, మాజీ సర్పంచ్ బాదనపల్లి నరసింహులు, నాయకులు గొల్ల కృష్ణమూర్తి యాదవ్, బాబా, రాజు కమల్, సల్మాన్, శ్రీను, సంగారెడ్డి, రఘు, అమృత్, తదితరులు పాల్గొన్నారు.