జిల్లాలో పకడ్బందీగా‘చేయూత’సర్వే
- కొత్తగా పెన్షన్ కోసం 31499 మంది దరఖాస్తు
164 మంది సర్వే అధికారుల నియామకం
మొదటిరోజు యాప్‌లో సాంకేతిక సమస్యలు
35 వేల మంది పెన్షన్ దారులు ఎక్కడ?
మేడ్చల్, సెప్టెంబర్ 15 (విజయ క్రాంతి): జిల్లాలో చేయూత పథకానికి వచ్చిన దరఖాస్తులపై సర్వే ప్రారంభమైంది. కొత్తగా పెన్షన్ కోసం 31499 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం (State Government )కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి 15వ తేదీ వరకు గడువునిచ్చింది. మంగళవారం గడు వు ముగియడంతో అదే రోజు సర్వే ప్రారంభించారు. సర్వే కోసం 164 మంది సర్వే అధికారులను నియమించారు.
సర్వే అధికారులు ఇంటింటికి వెళ్లి వివరాలను యాప్ లో నమోదు చేయాల్సి ఉంటుంది. మొదటిరోజు సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో సర్వే చేయలేకపోయారు. పగడబందీగా సర్వే చేయడానికి సర్వే అధికారులకు శిక్షణ ఇచ్చారు. దరఖాస్తుదారుల వివరాలు సేకరించి యాపులో నమోదు చేయనున్నా రు. దరఖాస్తుదారులకు తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి. తెల్ల రేషన్ కార్డు లేకుంటే ఆదా య ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉం టుంది. 26వ తేదీ వరకు సర్వే జరగనుంది.
వృద్ధాప్య పెన్షన్లు లేవు!
కొత్తగా పెన్షన్ కోసం వృద్ధాప్య పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరించలేదు. వితంతు, ఒంటరి మహిళ, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికుల పెన్షన్లకు మాత్రమే దరఖాస్తుల స్వీకరించారు. జిల్లాలో వితంతు పెన్షన్ కోసం అత్యధికంగా 21227 దరఖాస్తులు వచ్చాయి. ఒంటరి మహిళ పెన్షన్ కోసం 2688, దివ్యాంగ పెన్షన్ కోసం 7005, చేనేత కార్మికుల పెన్షన్ కోసం 143, గీత కార్మికుల పెన్షన్ కోసం 436 దరఖాస్తులు వచ్చాయి.
35 వేల పైన పెన్షన్ దారులు ఎక్కడ?
జిల్లాలో 35 వేల పైన పెన్షన్ దారులు ఎక్కడున్నారో తెలియడం లేదు. బోగస్ లబ్ధిదారులను ఏరివేసి అర్హులైన వారు, జీవించి ఉన్నవారికి పెన్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ గుర్తింపు సర్వే చేపట్టింది. పోస్ట్ ఆఫీస్ ద్వారా పెన్షన్ తీసుకుం టున్న వారు వేలిముద్ర వేసి తీసుకుంటున్నా రు. బ్యాంకు ద్వారా తీసుకుంటున్నా వారిలో ఎంతమంది జీవించి ఉన్నారు తెలియడం లే దు.
కానీ అందరి పెన్షన్ ఖాతా నుంచి డ్రా అవుతున్నాయి. జిల్లాలో చేయూత పథకం కింద వృద్ధులు, వితంతువులు, ఒంటరి మ హిళలు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, చేనే త కార్మికులు మొత్తం లక్ష 39 వేలమంది పె న్షన్ తీసుకుంటున్నారు. ఇందులో 1022 40 మంది బ్యాంకు నుంచి తీసుకుంటున్నారు. లబ్ధిదారుల ముఖ గుర్తింపు సర్వేకు జిల్లాలో 35వేల పైన పెన్షన్ దారులు దూ రంగా ఉన్నారు.
వీరు ఎక్కడున్నారు తెలియ డం లేదు. వీరిలో ఎంతమంది జీవించి ఉన్నారో కూడా తెలియడం లేదు. చాలామంది లబ్ధిదారులు లైవ్ అథెంటిఫికేషన్ చే యించుకున్నప్పటికీ వీరు మాత్రం స్పందించడం లేదు. అంటే ఇవి బోగస్ పెన్షన్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకాలం వీరి పేరు మీద ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగమైంది. అధికారులు విచారణ చేపట్టి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.