అంతరిక్షంలో అమెరికా ఆయుధాలు

16-09-2026 | 05:35am
  1. రష్యా, చైనాల సాంకేతికతతో యూఎస్‌కు వణుకు

వెల్లడించిన అమెరికా వైమానిక దళ కార్యదర్శి ట్రాయ్ మింక్

ఉపగ్రహాలను టార్గెట్ చేస్తున్న రష్యా, ఖండించిన మాస్కో

వాషింగ్టన్, సెప్టెంబర్ 15: అంతరిక్షంలోకి (Outer Space)ఆయుధాలను పంపామని తొలిసారిగా అమెరికా (America)అంగీకరించింది. అయితే ఏ ఆయుధాలను పంపారు? ఎప్పుడు పంపారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అమెరికా వైమానిక దళ కార్యదర్శి ట్రాయ్ మింక్ ఎయిర్, స్పేస్ అండ్ సైబర్ కాన్ఫరెన్స్ అనే కార్యక్రమంలో మాట్లాడుతూ..  ఈ విషయాన్ని ధృవీకరించారు. అవసరమైతే శత్రువుల దాడుల నుంచి సైనికులను కాపాడుకునేందుకు ఉపయోగపడే ఆయుధాలు కక్ష్యలో ఉన్నాయన్నారు.

అమెరికాను రక్షించుకునేందుకు, మారుతున్న కాలానికి అనుగుణంగా ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తమ సామర్థ్యం పెంచుకున్నామని చెప్పారు. అంతరిక్ష రంగంలో రష్యా తమకు కొరకరాని కొయ్యగా మారి తమదేశ ఉపగ్రహాలను టార్గెట్‌గా చేస్తుందేమో అనే ఆందోళనను అమెరికా అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అలా జరిగితే తమదేశ సైన్యం, సాధారణ ప్రజలపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని భావిస్తుంది.

ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్షంలో ఆయుధాలను సిద్ధం చేసుకుంటుంది. అమెరికా చేస్తున్న ఆరోపణలను రష్యా ఖండించింది. మరోవైపు చైనా సైనిక సామర్థ్యాలను భారీగా విస్తరించుకోవడం, అంతరిక్ష రంగంలో అమెరికాకు చెందిన ఇతర వ్యవస్థలకు అంతరాయం కలిగించే సాంకేతికతను అభివృద్ధి చేస్తోందని భావిస్తుంది. అమెరికాకు ప్రస్తుతం రష్యా, చైనాలే అతిపెద్ద సవాల్‌గా మారాయి. దీంతో యూఎస్ కూడా చడిచప్పుడు చేయకుండా తమ ప్రయత్నాలను ముమ్మరం చేసుకుంటూ ముందుకు వెళుతుంది.


మరిన్ని వార్తలు