15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ధీశాలి, రాజనీతిజ్ఞుడు ఛత్రపతి శివాజీ

19-02-2026 02:43 PM

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ 

శివాజీ జయంతి సందర్భంగా అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ 

షాద్‌నగర్,(విజయక్రాంతి): ధీశాలి, రాజనీతిజ్ఞుడు, పటిష్ట మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహరాజ్(Chhatrapati Shivaji Jayanti) అని,, మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన ధీరుడు ఛత్రపతి శివాజీ అని..  షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ అన్నారు.  గురువారం షాద్ నగర్ మున్సిపాలిటీ శివాజీ చౌక్ వద్ద ఆరె కటిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే శంకర్ తో పాటు మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందే మోహన్,

కౌన్సిలర్లు సంతోషి బాయ్ చందు, కలంకార్ దిలీప్, బచ్చలి నరేష్, గోపాల్,  అదేవిధంగా బిజెపి నేతలు అందే బాబయ్య, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి, ఆరెకటిక సంఘం అధ్యక్షులు నర్సింగ్, నవీన్, ప్రసాద్, అరుణ్, దుర్గేశ్, ప్రకాష్ తదితరులు హాజరయ్యారు. హాజరై, విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్  తదితరులు నివాళులర్పించారు. అనoతరం ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమాని అందరూ కలిసి ఆయన ప్రారంభించారు.

అదేవిధంగా పలువురు నాయకులు హాజరై కార్యక్రమాన్నీ ఉదేశించి మాట్లాడుతూ.. భారత చరిత్రలో అత్యంత ప్రసిద్ధమైన యోధుడు, రణనీతి నిపుణుడు, న్యాయవంతమైన పరిపాలకుడు. ఆయన జీవితం ధైర్యం, త్యాగం, స్వాతంత్ర్య ఆకాంక్షలకు ప్రతీక అని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో  కౌన్సిలర్లు సంతోషి బాయి చందూలాల్,  గోపాల్, కలంకార్ దిలీప్, బచ్చలి నరేష్, స్వరర్ పాషా,  శంకర్, మనీష్, సుదర్శన్ గౌడ్, శ్రీశైలం గౌడ్, ఆరె కటిక సంఘం  అధ్యక్షులు నర్శింగ్, నవీన్, ప్రసాద్, సభ్యులు చందులాల్, ప్రకాష్ అరుణ్ కుమార్ దుర్గేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు.