calender_icon.png 19 February, 2026 | 4:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పద్మా నగర్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

19-02-2026 02:28:04 PM

 స్టార్ యూత్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

తంగళ్ళపల్లి, ఫిబ్రవరి19 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం పద్మా నగర్ గ్రామంలో  ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్టార్ యూత్ పద్మా నగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొదటగా శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా యువత శివాజీ మహారాజ్ జయజయధ్వానాలతో గ్రామంలో దేశభక్తి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, పెద్దలు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.