calender_icon.png 16 October, 2025 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి ముఖ్యమంత్రి పరామర్శ

16-10-2025 02:08:52 AM

కాంతమ్మ చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు 

హనుమకొండ, అక్టోబర్ 15(విజయ క్రాంతి): నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం పరామర్శించారు. మాధవరెడ్డి మాతృమూ ర్తి కాంతమ్మ ఇటీవల మరణించగా కాజీపేట ప్రశాంత్‌నగర్ పీజీఆర్ గార్డెన్‌లో మాతృ యజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీలు కడియం కావ్య, బలరాం నాయక్, రఘువీర్‌రెడ్డి, విప్ రామచంద్ర నాయక్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, యశస్విని రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు. కాంతమ్మ చిత్రపటానికి సీఎం రేవంత్‌రెడ్డి తదితరులు పూలమా లలు వేసి నివాళులర్పించారు. 

కాగా మాధవరెడ్డిని పరామర్శించేందుకు సీఎం రేవం త్‌రెడ్డి హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్‌లో వచ్చారు. మాధవరెడ్డి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం హెలికాఫ్టర్‌లోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు తదితరులు హైదరాబా ద్‌కు బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.