4,5న ఉమ్మడి జిల్లాకు ముఖ్యమంత్రి రాక
దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి
భూత్పూర్ మే 31 : ఈ నెల 4, 5వ తేదీ న ఉమ్మడి పాలమూరు జిల్లాల ప్రాజెక్టుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూన్ 5వ తేదీ కరివేన ప్రాజెక్ట్ పర్యటన విచ్చేస్తున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు సందర్భంగా ఆదివారం ఇరిగేషన్ సీఈలు సత్యనారాయణ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి తో కలసి కరివేన ప్రాజెక్టు వద్ద రివ్యూ సమావేశానికి సంబంధించి హెలికాప్టర్ కోసం స్థల పరిశీలన చేశారు.
పాలమూరు చేయడమే లక్ష్యంగా ప్రజాపాలన ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఎవరో ఎన్నో ఆరోపణలు చేస్తే వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. మంచి చేయాలని సంకల్పం మన సులో ఉండాలని మాయమాటలు చెప్పే కాలానికి కాలం చెల్లిందని విమర్శించారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ప్రజాపాలన ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.






