ప్రధాని నరేంద్ర మోదీ మన్‌కీ బాత్ వీక్షించిన ఎంపీ
01-06-2026 12:00 AM
మహబూబ్ నగర్ రూరల్ మే 31 : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 134వ ఎపిసోడ్ ను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు,ఎంపీ డీకే అరుణ వీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దేశం బాగుకోసమే బిజెపి నిరంతరం శ్రమిస్తుందని బిజెపి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. అందరం ఐక్యంగా ఉండి అభివృద్ధి దిశగా ముందుకు సాగితేనే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని తెలియజేశారు.






