25 May, 2026 | 3:59 PM

సీఎంకు రాఖీ కట్టిన చిన్నారులు

20-08-2024 06:17 AM

హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి) : వినికిడి సమస్యతో బాధప డుతూ ప్రభుత్వ సహాయంతో చికిత్స చేయించుకున్న పలువురు చిన్నారులు సీఎం రేవంత్‌రెడ్డికి రాఖీలు కట్టి అభిమానాన్ని చాటుకున్నారు. వినికిడి సమస్య ఉన్న ఐదేళ్లలోపు పిల్లల కు సర్జరీలు చేస్తే సమస్య పరిష్కారమవుతుంది. సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత వినికిడి సమస్యతో బాధపడుతున్న చిన్నా రుల వైద్యానికి అవసరమైన సహాయాన్ని వేగంగా అందిస్తున్నారు.

దీంతో హైదరాబాద్ కోఠిలోని ఈఎన్టీ హాస్పిటల్‌లో సర్జరీలు జరుగుతున్నాయి. సర్జరీలు చేయించుకున్న వారికి ఎల్‌వోసీ, ఖరీదైన వినికిడి యంత్రాలను సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ప్రభుత్వం అందిస్తోంది. ఇటీవల సర్జరీలు చేయించుకున్న పలువురు చిన్నారులు ఈఎన్టీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆనంద్ ఆచార్య, వైద్యు రాలు డీకే వీణ ఆధ్వర్యంలో  సోమవారం సచివాలయానికి వచ్చి సీఎం రేవంత్‌రెడ్డికి రాఖీలు కట్టారు.