18 July, 2026 | 12:30 AM

నీట్-2026లో చిలుకూరు గురుకుల విద్యార్థుల ప్రతిభ

18-07-2026 12:00 AM

60 మందికి వైద్యకోర్సులకు అర్హత 

మొయినాబాద్, జూలై 17 (విజయక్రాంతి): మొయినా బాద్ మండలంలోని చిలుకూరులో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులు నీట్2026 పరీక్షలో విశేష ప్రతిభ కనబర్చారు. ఈ ఏడాది నీట్ పరీక్షకు కళాశాల నుంచి శిక్షణ పొందిన మొత్తం 110 మంది విద్యార్థుల్లో 60 మంది ఎంబీబీఎస్, బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీవీఎస్సీ తదితర వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత సాధించే స్థాయిలో మార్కులు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ శౌరి రాజ్ తెలిపారు.

ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యా ర్థులను, వారి తల్లిదండ్రులను, అధ్యాపక బృందాన్ని ప్రిన్సిపాల్ అభినందించారు. కళాశాల టాపర్లుగా చి. నాగచైతన్య  560 మార్కులు, ఏ. ప్రణీత్  510 మార్కులు, జి. శ్రీనివాస్  505 మార్కులు సాధించి ప్రత్యేక గుర్తింపు పొందారు. గురుకుల విద్యార్థుల ఈ విజయం విద్యా సంస్థకు మరో మైలురాయిగా నిలిచిందని అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.