అంతరిక్షంలో ఏడాది పూర్తి
29-10-2024 01:18 AM
న్యూఢిల్లీ, అక్టోబర్ 28: చైనా వ్యోమగామి యే గ్యాంగ్‌ఫు సరికొత్త మైలురాయిని చేరుకున్నాడు. గతేడాది అక్టోబర్ 28న టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించిన గ్యాంగ్‌ఫు నేటితో 365 రోజులు స్పేస్‌లోనే ఉండి చరిత్ర లిఖించాడు. 43 ఏళ్ల గ్యాంగ్‌ఫు రెండు అంతరిక్ష యాత్రలలో అనుభవజుడు. స్టేషన్ నిర్వహణ, అంతరిక్షంలో నడక సహా ఇతరత్రా ప్రయోగాలను ఆయన నిర్వహించారు. ఈ మిషన్ అంతరిక్షంలో సుదీర్ఘ కాలం మనిషి మనుగడ సాధించగలడని, శారీరక, మానసిక ప్రభావాలపై కీలక మైన డాటా సేకరించేందుకు ఉపయోగపడనుందని శా్రస్త్రవేత్తలు తెలిపారు. కాగా, షెన్ జౌ అక్టోబర్ 29 చైనా ప్రయోగించను ంది. ఇది టియాంగాంగ్‌కు కొత్త సిబ్బందిని పంపించడంతో పాటు స్టేషన్ శాస్త్రీయ సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు దోహదపడనుంది.






