ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గానికి జిల్లా స్థాయిలో రెండో స్థానం
వేంసూరు మండలానికి ప్రథమ స్థానం
ఎమ్మెల్యే మట్టా రాగమయి ప్రత్యేక చొరవ
సత్తుపల్లి,(విజయక్రాంతి): ఎమ్మెల్యే డా.మట్టా రాగమయి దయానంద్ ప్రత్యేక చొరవ, అవగాహన కార్యక్రమాల ఫలితంగా ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో ఖమ్మం జిల్లాలోనే సత్తుపల్లి నియోజకవర్గం రెండో స్థానంలో నియోజకవర్గ స్థాయిలో వేంసూరు మండలం ప్రథమ స్థానంలో నిలిచిందని పలువురు అభినందించారు. సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలు డా.మట్టా రాగమయి దయానంద్ ఎస్‌ఐఆర్ కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం, రెవెన్యూ అధికారులకు నిరంతరం మార్గనిర్దేశనం చేయడం, అవసరమైన సూచనలు అందించడం వల్ల ఈ ఫలితం సాధ్యమైందని పేర్కొన్నారు.
ఎంఆర్ఓ పర్యవేక్షణలో రెవెన్యూ అధికారులు, బీఎల్ఓలు, బీఎల్ఏలు సమన్వయంతో పనిచేస్తూ ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను చైతన్య పరిచారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో ప్రతి అర్హత కలిగిన ఓటరు తప్పనిసరిగా నమోదు కావాలనే లక్ష్యంతో ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించడం ద్వారా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ విజయానికి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ నాయకత్వం, ఎంఆర్ఓ కృషి, రెవెన్యూ అధికారుల సమర్థ నిర్వహణ, బీఎల్ఓలు, బీఎల్ఏల అంకితభావమే ప్రధాన కారణాలని పేర్కొన్నారు.
అలాగే సత్తుపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ దోమా ఆనంద్ బాబు, వేంసూరు గ్రామ సర్పంచ్ ఎం.డి. ఫఖ్రుద్దీన్ అందించిన ప్రోత్సాహం, సహకారం కూడా కార్యక్రమం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించాయని కొనియాడారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములైన ఎంఆర్ఓ, రెవెన్యూ అధికారులు, బీఎల్ఓలు, బీఎల్ఏలు, ప్రజాప్రతినిధులు, అలాగే అవగాహనతో నమోదు ప్రక్రియలో పాల్గొన్న ప్రతి ఓటరికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు.






