30 July, 2026 | 9:17 PM

Breaking News

సంగెం నగేష్ రెడ్డి దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం, ఆగ్రోస్ చైర్మన్ కాసుల   •   సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   •   అమెరికాలో ఉన్నా ఆలోచన కల్లూరు అభివృద్ధిపైనే   •   సలబత్‌పూర్ చెక్‌పోస్ట్ ఘటనపై ప్రాథమిక విచారణకు ఆదేశాలు   •   మాల్తుమ్మెదలో బేటి బచావో బేటి పడావో కార్యక్రమంపై అవగాహన   •   భారీ వర్షానికి ఇల్లు కూలిన ఘటన..   •   భారీ వర్షాల నేపథ్యంలో కల్వర్టు, వంతెనను పరిశీలించిన ఐటీడీఏ పిఓ   •   ఉట్నూర్ లోని ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే..   •   పరవళ్లు తొక్కుతున్న గుండారం రిజర్వాయర్ మత్తడి   •   విద్యుత్‌ సరఫరాలో మునుగోడును రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దాలి   •  

అత్తతో వాగ్వాదం.. వివాహిత ఆత్మహత్య

30-07-2026 08:30 PM

* మనస్తాపంతో ఫ్యాన్‌కు ఉరేసుకున్న మహిళ

* ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి

అచ్చంపేట: అత్తతో కుటుంబ విషయంపై జరిగిన వాగ్వాదంతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన అచ్చంపేట మండలం బొమ్మనపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పదర గ్రామానికి చెందిన జల్లెల మంజుల (25)కు బొమ్మన్‌పల్లికి చెందిన మహేష్‌తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గురువారం ఉదయం కుటుంబ విషయంపై మంజులకు అత్త లక్ష్మమ్మతో వాగ్వాదం జరిగింది.

అనంతరం మనస్తాపానికి గురైన మంజుల ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త మహేష్ సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ఆమెను అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు సిద్దాపూర్ ఎస్‌ఐ సి. అంజయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.