30 July, 2026 | 9:17 PM

Breaking News

సంగెం నగేష్ రెడ్డి దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం, ఆగ్రోస్ చైర్మన్ కాసుల   •   సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   •   అమెరికాలో ఉన్నా ఆలోచన కల్లూరు అభివృద్ధిపైనే   •   సలబత్‌పూర్ చెక్‌పోస్ట్ ఘటనపై ప్రాథమిక విచారణకు ఆదేశాలు   •   మాల్తుమ్మెదలో బేటి బచావో బేటి పడావో కార్యక్రమంపై అవగాహన   •   భారీ వర్షానికి ఇల్లు కూలిన ఘటన..   •   భారీ వర్షాల నేపథ్యంలో కల్వర్టు, వంతెనను పరిశీలించిన ఐటీడీఏ పిఓ   •   ఉట్నూర్ లోని ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే..   •   పరవళ్లు తొక్కుతున్న గుండారం రిజర్వాయర్ మత్తడి   •   విద్యుత్‌ సరఫరాలో మునుగోడును రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దాలి   •  

టి జేఏసీ జిల్లా చైర్మన్‌కు రంగానాయక్ కుటుంబం అభినందనలు

30-07-2026 08:43 PM

తిరుమలాయపాలెం,(విజయక్రాంతి): తిరుమలాయపాలెం మండలానికి చెందిన మందడి ఇజ్రాయిల్‌ను తెలంగాణ జేఏసీ ఖమ్మం జిల్లా చైర్మన్‌గా నియమించిన సందర్భంగా మండలానికి చెందిన బానోత్  రంగనాయక్ దంపతులు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చేతి గడియారాన్ని బహుకరించి, అల్పాహారం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. వారు మాట్లాడుతూ జిల్లా టి జేఏసీ చైర్మన్‌గా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు జిల్లాలో మంచి కార్యక్రమాలకు తోడ్పడాలని,

న్యాయపరమైన హక్కులను సాధిస్తూ రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు.మందడి ఇజ్రాయిల్ నాయకత్వంలో జిల్లా వ్యాప్తంగా సామాజిక న్యాయం, ప్రజా హక్కుల పరిరక్షణలో టి జేఏసీ కీలక పాత్ర పోషించాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపే దిశగా నిరంతరం సేవలందించాలని కోరుతూ మరోసారి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బానోత్ సుజాత డాక్టర్ లావణ్య, ఉపేందర్, వనిత, స్నేహితులు, బంధువులు పాల్గొన్నారు.