6 April, 2026 | 4:56 AM

పూలే ఎక్సలెన్స్‌కు చిరంజీవులు ఎంపిక

06-04-2026 01:58 AM
  1. బీసీల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ.. 10న అవార్డు ప్రదానం

టీసీసీఎస్ అధ్యక్షుడు డాక్టర్ రాజ్‌నారాయణ

హైదరాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): బీసీ మేధావుల ఫోరం అధ్యక్షుడు, వెనుకబడిన తరగతుల సంక్షేమ, అభివృద్ధి వైపుగా బీసీలను జాగృతం చేస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టీ చిరంజీవులును మహాత్మ జ్యోతిరావు పూలే ఎక్సలెన్స్ అవార్డు ఎంపిక చేసినట్టు తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ రాజ్‌నారాయణ ముదిరాజ్ తెలిపారు. ఈ నెల 10న మహాత్మా జ్యోతిరావు పూలే 199 జయంతిని పురస్కరించుకొని ఈ అవార్డు ప్రదానం చేస్తారని ఆదివారం పత్రిక ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వీ హనుమంతరావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, యాంటీ కరప్షన్ బ్యూరో తెలంగాణ రాష్ట్ర మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు, ఎంపీ ఈటల రాజేందర్ తది తరులు పాల్గొంటారని పేర్కొన్నారు.

2002 బ్యాచ్‌కు చెందిన టీ చిరంజీవులు గ్రామీణ అభివృద్ధి, పట్టణ ప్రణాళిక, మహి ళా సాధికారత, విద్య, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ రంగాలలో అపార మైన అనుభవం ఉం దని, హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా, కాకతీయ శాతవా హన, యూనివర్సిటీలలో వీసీగా అనేక ఉన్నత పదవులు నిర్వహించారని తెలిపారు.

భారత రాష్ట్రపతి చేతుల మీదుగా నాబార్డ్ ఎస్‌హెచ్‌జీ బ్యాంక్ లింకేజీ అవార్డు, 2019 లో తె లంగాణ రాష్ట్ర ఎక్సలెన్స్ అవార్డు, 2020లో భారత ప్రభుత్వ ఐటీ శాఖ ఇచ్చే ఎమర్జింగ్ టెక్నాలజీస్‌కు గోల్డ్ మెడల్‌లు అందుకున్నారని చెప్పారు. గత రెండు సంవత్సరాలుగా బీసీ ఉద్యమం కోసం పనిచేస్తూ బీసీ సిద్ధాంతాలపై అనేక పుస్తకాలు రాసి, తెలంగాణ బీసీ ప్రజలను ఏకతాటిపై తీసుకురావడానికి తన ప్రసంగాల ద్వారా, అనేక సదస్సులు నిర్వహిస్తూ బీసీలను జాగృత పరుస్తున్నారని రాజ్‌నారాయణ హర్షం వ్యక్తం చేశారు.