01-02-2026 03:51:42 PM
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
చిట్యాల,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీతోనే సుస్థిర అభివృద్ధి సాధ్యమని చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా 01, 04, 05, 06 వార్డుల్లో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలనకు నాంది పలికింది కాంగ్రెస్ పార్టీయేనని, కాంగ్రెస్ పార్టీతోనే సుస్థిర అభివృద్ధి సాధ్యమని వెల్లడించారు.
చిట్యాల పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, పేదల సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాలు, మహిళల ఆర్థిక భద్రత వంటి అంశాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.