విద్యానిధి పథకానికి దరఖాస్తు చేసుకోవాలి
01-02-2026 03:49 PM
నిర్మల్,(విజయక్రాంతి): డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి అరులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి దయానంద తెలిపారు. విదేశాల్లో చదువుకునే వారికి ప్రభుత్వం ద్వారా 20 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లేవారు ఈ పథకానికి ఆరులని పేర్కొన్నారు. అభ్యర్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు వచ్చేనెల 31 వరకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తీదని పేర్కొన్నారు ఇతర సమాచారం కోసం కార్యాలయంలో సంప్రదించాలని ఆయన సూచించారు






