కాంగ్రెస్ పార్టీలో చేరిన చిట్యాల సర్పంచ్
తాడ్వాయి, జూలై, 9 ( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల గ్రామ సర్పంచ్ రంజిత్ రెడ్డి ఎమ్మెల్యే కె మదన్ మోహన్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే మదన్ మోహన్ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రత్యేక అభివృద్ధి చేస్తున్నందున తాను కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితుడినయి ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.
గ్రామానికి సబ్ స్టేషన్ రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. గతంలో ఎన్నిసార్లు ప్రయత్నించిన సబ్ స్టేషన్ ఎవరూ మంజూరు చేయలేదని ఎమ్మెల్యే మదన్మోహన్ సబ్ స్టేషన్ మంజూరు చేయించి విధ్యుత్ సమస్యలు తీర్చారని తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు జక్కుల రాజిరెడ్డి, సంతాయిపేట సర్పంచ్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






