15 June, 2026 | 10:23 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

గణేష్ శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించాలి- సిఐ శశిధర్ రెడ్డి

15-09-2024 03:47 PM

మందమర్రి,(విజయక్రాంతి): మందమర్రి సర్కిల్ పరిధిలో జరుగు గణష్ నిమజ్జనం శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని పట్టణ సిఐ శశిధర్ రెడ్డి కోరారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసులు సూచించిన నియమాలు ఖచ్చితంగా పాటించాలన్నారు. అధిక శబ్దాలను కలిగించే డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని స్పష్టం చేశారు. విగ్రహాలను నిమజ్జనానికి తీసుకువెళ్లే వాహనాలలో మద్యం మత్తులో ఉన్నవారిని అనుమతించకూడదని, మండపం నిర్వాహకులకు,  ఉత్సవ కమిటీ నిర్వాహకులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

రెచ్చగొట్టే నినాదాలు చేయడం, మత స్థలాల దగ్గర ఊరేగింపులను నిలువ కూడదని అన్నారు. కనులపండుగగా జరుగు గణేష్ నిమజ్జన యాత్రను ప్రతి ఒక్కరు భక్తిశ్రద్ధలతో జరపాలని ఎవరు కూడా ఇతర భక్తులకు కానీ సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగేలా ప్రవర్తించరాదని ఆయన తెలిపారు. ప్రతి విగ్రహం నిమర్జనం వీలైనంత త్వరగా బయలుదేరాలని, వాహనాలపై పరిమితికి మించి భక్తులు వెళ్లకూడదని తెలిపారు. ఊరేగింపు సమయంలో కరెంటు తీగలను గమనించి వాహనాన్ని నడపాలని కోరారు.