15 June, 2026 | 9:01 PM

Breaking News

ఘనంగా ఉప ముఖ్యమంత్రి భట్టి జన్మదిన వేడుకలు   •   విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాలు పంపిణీ   •   ఆర్థిక పరిస్థితులను బాగు చేసింది ముఖ్యమంత్రి   •   గ్రామపంచాయతీ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి   •   అర్హులకే రేషన్ కార్డు.. ప్రభుత్వ ఉద్యోగుల కార్డులు తొలగించాలి   •   మండలంలోని పలు గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షుల ఎన్నిక   •   సమ్మె విరమిస్తున్నాం... యధావిధిగా పనులు   •   అధికారులను సమన్వయం చేసుకోలేని దద్దమ్మ రేవంత్ రెడ్డి   •   రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •  

జిట్టా ప్రజల మనిషి : హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ

15-09-2024 02:13 PM

యాదాద్రి భువనగిరి, (విజయక్రాంతి): జిట్టా బాలకృష్ణ రెడ్డి ప్రజల మనిషి... ఆయన లేని లోటు తీరనిదని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం భువనగిరి లో జిట్టా బాలకృష్ణ రెడ్డి దశదిన కర్మ సందర్భంగా హాజరై ఆయనకు నివాళ్లు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆయన మృతి నన్ను ఎంతగానో కలిచివేసింది.. తెలంగాణ కోసం అంకితభావంతో పని చేసిన వ్యక్తి జిట్టా బాలకృష్ణ రెడ్డి అని అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్లోరైడ్ బాధితులతో పోరాడిన వ్యక్తి జిట్టా.. జిట్టా బాలకృష్ణ రెడ్డికి పదవుల లేకపోయిన ప్రజల మానుషులలో నిలిచిపోయాడన్నారు. ఎంతోమంది బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పని వ్యక్తి జిట్టా బాలకృష్ణ రెడ్డి సొంత డబ్బులతో తెలంగాణ ఉద్యమాన్ని నడిన వ్యక్తి అని కొనియాడారు. జిట్టా బాలకృష్ణ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటాను.. జిట్టా బాలకృష్ణ రెడ్డి ఆశయాల కొరకు మన అందరం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు.