1 July, 2026 | 1:11 AM

సినీవారియర్స్ జెర్సీ ఆవిష్కరణ

01-07-2026 12:00 AM

హైదరాబాద్, జూన్ 30 : సినీ క్రిక్ ప్రీమియర్ లీగ్‌లో పీఎస్ కొలాబరేషన్స్ జట్టు సినీ వారియర్స్ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. పీఎస్ కొలాబరేషన్స్ ఫౌం డర్ ప్రవీణ్ కుమార్ చేతల, పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో జెర్సీలను ఆవిష్కరించారు. క్రీడాస్ఫూర్తి , ఐక్యత, ప్రతిభకు ప్రతీకగా రూపొందించిన ఈ జెర్సీ తమ టీమ్‌కు సరికొత్త ఉత్సాహాన్ని సినీ వారియర్స్ కెప్టెన్ బాబీ వారియర్స్ చెప్పారు. బుధవారం నుంచి జరగబోయే సినీ క్రిక్ ప్రీమియర్ లీగ్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి.

మొత్తం 27 మ్యా చ్‌ల అలరించబోతున్నాయి. సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉండే అన్ని విభాగాలకు చెంది న వారంతా ఈ లీగ్‌లో ఆడుతుండడం సంతోషంగా ఉందని ఎస్ కొలాబరేషన్స్ ఫౌండర్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. ఇదిలా ఉంటే ఇదే వేదికపై లించ్‌పిన్ సాఫ్ట్ సొల్యూషన్, పీఎస్ కొలాబరేషన్స్ భాగస్వామ్యంతో త్వరలో ప్రారంభం కానున్న టెక్నో ఈవెంట్ గేమ్‌థాన్ అధికారిక పోస్టర్‌ను కూడా లాంఛ్ చేశారు.