పరాగ్వే సంచలన విజయం
01-07-2026 12:00 AM
పెనాల్టీ షూటౌట్లో జర్మనీ ఓటమి
బోస్టన్, జూన్ 30: సాకర్ ప్రపంచకప్‌లో మాజీ ఛాంపియన్ జర్మనీకి భారీ షాక్ తగిలింది. పరాగ్వే సంచలన ప్రదర్శనతో ఆ జట్టు ఇంటిదారి పట్టింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో పరాగ్వే పెనాల్టీ షూటౌట్‌లో జర్మనీని ఓడించింది. నిర్ణీత సమయంలోపు ఇరు జట్లు 1- సమంగా నిలవడంతో పెనాల్టీ షూటౌట్ రౌండ్ నిర్వహించారు.
అయితే ప్రపంచ కప్ చరిత్రలోనే తొలిసారిగా పెనాల్టీ షూటౌట్లో జర్మనీ పరాజయం పాలైంది. షూ టౌట్‌లో పరాగ్వే గోల్‌కీపర్ ఓర్లాండో గిల్ అద్భుతం గా రాణించి జర్మనీ ప్లేయర్స్ గోల్స్‌ను సమర్థంగా అడ్డుకున్నాడు. మరోవైపు పరాగ్వే కూడా రెండు అవకాశాలను చేజార్చుకున్నా, చివరికి జోస్ కానాలే విజయవంతంగా పెనాల్టీని గోల్‌గా మలిచాడు. అదే సమయంలో తాహ్ తన గోల్‌ను బార్‌పైకి కొట్టడంతో ఓటమి తప్పలేదు.






