1 July, 2026 | 1:03 AM

హర్మన్‌ప్రీత్‌కే పగ్గాలు

01-07-2026 12:00 AM
  1. జి.కమిలినికి పిలుపు
  2. ఆసియా క్రీడలకు భారత జట్టు ప్రకటన

ముంబై, జూన్ 30: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల కోసం భారత మహిళల క్రికె ట్ జట్టును ప్రకటించారు. ప్రస్తుత మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ సెమీస్ చేరకుండానే ఇంటిదారి పట్టినా మరోసారి సెలక్టర్లు హర్మన్‌ప్రీత్ కౌర్‌పైనే నమ్మ కం ఉంచి సారథిగా కొనసాగించారు. వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధానను ఎంపిక చేశారు. ప్రపంచకప్‌లో ఆడిన జట్టునే దాదాపుగా కొనసాగించారు. వికెట్ కీపర్ యాస్తికా భాటియాను తప్పించి 17 ఏళ్ల యువ సంచలనం కమలినికి పిలుపునిచ్చారు.

దేశవాళీ క్రికెట్‌లో కమలిని నిలకడగా రాణిస్తోంది. ఇదిలా ఉంటే వరల్డ్ కప్ మధ్యలో గాయపడిన శ్రేయాంక పాటిల్‌ను ఆసియా క్రీడలకు ఎంపిక చేసా రు. అయితే ఆమె ఫిట్‌నెస్ సాధిస్తేనే తుది జట్టులో ఆడే అవకాశం ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. గత ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన భారత మహిళల జట్టు మరోసారి బంగారు పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్‌లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి , షెఫాలీ వర్మ , జెమీమా రోడ్రిగ్స్ , రిఛా ఘోష్‌లతో బలంగానే ఉంది.

బౌలింగ్‌లో మరోసారి స్పిన్నర్లే కీలకం కాబోతున్నారు. ప్రపంచకప్‌లో అదరగొట్టిన తెలుగమ్మాయి శ్రీచరణి, దీప్తి శర్మ చోటు దక్కించుకున్నారు. అటు పేస్ ఎటాక్‌లో రేణుకా సింగ్ , క్రాంతి గౌడ్ , అరుంధతి రెడ్డి, నందిని శర్మ బాధ్యతలు పంచుకోనున్నారు. ఆసియా క్రీడలకు జపాన్‌లోని ఐచీ నగోయా నగరంలో సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకూ జరగనున్నాయి.

ఆసియా క్రీడలకు భారత మహిళల జట్టు

హర్మన్‌ప్రీత్(కెప్టెన్), మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ, జెమీమా, దీప్తి శర్మ, రిచా ఘోష్, జి.కమలిని, భారతి ఫుల్మాలి, శ్రీ చరణి, రేణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, నందిని శర్మ.