26 May, 2026 | 6:35 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

4 లెబర్ కోడ్స్ ఉపసంహరించుకునేంత వరకు పోరాడుదాం

01-04-2026 02:47 PM

సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి తాండ్ర అంజయ్య

సుల్తానాబాద్,(విజయక్రాంతి): బ్లాక్ డే సందర్భంగా బుధవారం పెద్దపల్లి జిల్లా  సుల్తానాబాద్ మండలం రైస్ మిల్ కెనాల్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నల్ల జెండాలు ,బ్యాడ్జీలతో నిరసన ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి. తాండ్ర అంజయ్య మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్స్ ను ఏప్రిల్ ఒకటి నుండి అమలు చేయడానికి ఆదేశాలు ఇచ్చిందని, ఈ దుర్మార్గమైన లేబర్ కోడ్స్ ను వెంటనే ఉపసమరించుకోవాలి.

అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ లేబర్ కోడ్స్ ను అమలు చేయమని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్స్ ను రద్దు చేయమని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అనేకసార్లు సమ్మెలు నిర్వహించిన వీటిని పెడల చెవిని పెట్టి నిరంకుశంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం లేబర్ కోడ్స్ అమలుకు ఆదేశాలు ఇచ్చిందని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కార్మిక వర్గం ప్రతిఘటించాలని అన్నారు.

ఈ సమావేశంలో సిఐటియు మండల కో కన్వీనర్ మాతంగి రాజమల్లు,రైస్ మిల్ ఆపరేటర్ల సంఘం, కార్యదర్శి నౌండ్ల బ్రహ్మచారి, ఉపాధ్యక్షులు కల్లేపెల్లి ప్రసాద్, కొల్లూరు తిరుపతి, మంజూర్, ప్రభాకర్, శ్రీశైలం, చొప్పరి రాజు, తిరుపతి, ఓదెలు, బాలకృష్ణ సుధాకర్ రావు, రాము, కిరణ్, రాజు, రాజేశం, రాజు, శీను, రమేష్,సారయ్య, అశోక్,మహేందర్,  మురళి, అనిల్, సంతోష్, సంపత్, శ్రీధర్, రవీందర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు...