12 March, 2026 | 3:08 AM

సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగుల జాబితా విడుదల

11-03-2026 12:00 AM

12 నుంచి అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్

హైదరాబాద్, మార్చి 10 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పోస్టుల భర్తీకి మెరిట్ జాబితాను వైద్యారోగ్యశాఖ విడుదల చేసింది. మొత్తం 692 సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్టు) ఉద్యోగాల నియామకానికి ప్రొవిజినల్ మెరిట్ జాబితాను మంగళవారం మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. దీన్ని అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

ఈ జాబితాలో ఎంపికైన అభ్యర్థు లకు మార్చి 12, 13వ తేదీల్లో హైదరాబాద్ వెంగళరావునగర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ వెల్ఫేర్ కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను నిర్వహిస్తారు. వెరిఫికేషన్ షెడ్యూల్‌తోపాటు అభ్యర్థులు తమ వెంట తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్‌ల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచారు.

వెరిఫికేషన్ అనంతరం తుది మెరిట్ జాబి తా, ఎంపిక జాబితాలను విడుదల చేయనున్నారు. ఈనెలాఖరు నాటికి 692 మంది వైద్యులు ఉద్యోగాల్లో చేరతారని ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు.