5 May, 2026 | 1:48 PM

Breaking News

పదవ తరగతిలో ప్రతిభ చాటిన శాలివాహన విద్యార్థులకు ఘన అభినందనలు   •   దేవరకొండ మున్సిపాలిటీ నూతన కమిషనర్‌కు బీసీ సంఘం ఆధ్వర్యంలో సన్మానం   •   వడదెబ్బతో బాలిక మృతి   •   మిషన్ భగీరథ నీరు సరిగా అందడం లేదు: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్   •   కన్నాలలో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం   •   రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు విస్తృతంగా నిర్వహించాలి   •   లింగుపల్లి ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   UAEపై దాడులు, భారతీయులకు గాయాలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన!   •   “ITP Aero – India” ప్లాంటుకు శ్రీధర్ బాబు శంకుస్థాపన   •  

మహిళ కడుపులో 2 కిలోల వెంట్రుకలు

07-10-2024 12:18 AM

ఆపరేషన్ చేసి తొలగించిన వైద్యులు

బరేలీ (ఉత్తరప్రదేశ్), అక్టోబర్ 6: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీకి చెందని ఓ మహిళ(25) అరుదైన వ్యాధితో బాధపడుతూ ఉంది. ఆమె గత 15 ఏళ్లనుం చి తలవెంట్రుకలు తింటూ వస్తోంది. తాజాగా ఆమెకు తీవ్ర కడుపు నొప్పి ప్రారంభం అయ్యింది. ఏం తిన్నా వాంతుల రూపంలో బయటకు వచ్చేసేది. ఆమె సెప్టెంబర్ 22న బరేలీలోని మహారాణా ప్రతాప్ జిల్లాలోని ప్రభు త్వ ఆసుపత్రిలో చేరింది.

ఆమెకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు.. బాధిత మహిళ ట్రైకోలోటోమేనియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. ఈ వ్యాధి సోకినవారికి జుట్టు తినాలని బలమైన కోరిక ఉం టుందట. ఈ కారణాంగానే తల వెం ట్రుకలు తినడం ఆమెకు అలవాటుగా మారిపోయందని వైద్యులు తెలిపారు.

ప్రస్తుతం ఆమె కడుపులో 2 కేజీల వర కు వెంట్రుకలు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు శస్త్ర చికిత్స చేసి వాటిని తొలగించారు. కొద్దిరోజుల తర్వాత ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆసుప త్రి నుంచి డిశ్చార్జ్ కూడా చేశారని సమాచారం.