6 July, 2026 | 2:52 AM

గరిడేపల్లిలో ఒకే పార్టీకి చెందిన ఇరువర్గాల మధ్య ఘర్షణ

06-07-2026 01:51 AM
  1. ఇరువురికి గాయాలు 
  2. ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు
  3. గొడవలకు అడ్డాగా మారుతున్న దాబాలు 

గరిడేపల్లి, జులై 5 :మండల కేంద్రమైన గరిడేపల్లి లోని అబ్బిరెడ్డిగూడెం క్రాస్ రోడ్డు వద్ద ఉన్న ఒక దాబాలో ఆదివారం సాయం త్రం ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మండలంలోని పొనుగోడు గ్రామానికి చెం దిన ఈ వర్గాలు ఒక విషయంలో తగాదాపడి కొట్టుకోవడంతో ఒకరికి తీవ్ర గా యాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మం డల కేంద్రమైన గరిడేపల్లి లోని దాబాలో పొ నుగోడు గ్రామానికి చెందిన ఒక వర్గం వారు మద్యం సేవిస్తూ ఉండగా, అదే గ్రామానికి చెందిన మరో వర్గం వారు మద్యం సేవించేందుకు అక్కడికి వచ్చినట్లు తెలిసింది. కొద్దిసేపటి అనంతరం మద్యం సేవిస్తున్న ఇరువ  ర్గాల లోని ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగిన సంభాషణ వివాదానికి దారి తీసినట్లు సమాచారం.

ఆ వివాదం కాస్త ముదిరి ఘర్షణకు అవకాశం కల్పించిందని తెలిసింది. దీంతో ఇరువర్గాలు కొట్టుకోవడంతో ఒక వర్గానికి చెందిన వ్యక్తిపై బీరు సీసాతో దాడి చేయడం తో గాయాలైనట్లు సమాచారం. గాయపడిన వ్యక్తిని హుజూర్నగర్ ఆసుపత్రికి తరలించిన ట్లు తెలిసింది. విషయం తెలుసుకుని పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ ఇరు వర్గాలకు చెందిన నాయకులు ఒకే పార్టీకి చెందిన వారు కావడం విశేషం. ఘర్షణ జరిగిన సమయంలో ఇరు వర్గాలకు చెందిన ఇద్దరు నా యకులు కూడా సంఘటన స్థలంలోనే ఉన్న ట్లు తెలిసింది. నాయకులు ఇద్దరు కూడా గొడవను ఆపేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయినట్లు తెలిసింది.

పొనుగోడు గ్రామం రాజకీయంగా చైతన్యవంతమైన గ్రామం కావడంతో ఇరు వర్గాలు కొట్టుకున్న విషయం గ్రామంలో ఘర్షణ విషయం దావనంలా వ్యాపించింది. ఇటీవల ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఇరు వర్గాలకు చెందిన వ్యక్తులు కొట్టుకోవడంతో గ్రామంలో ఒకింత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు సమాచారం. గరిడేపల్లి ఎస్‌ఐ శ్రీకాంత్ వెంటనే పోలీసు బలగాలను పొనుగోడు గ్రామానికి తరలించి బందు బస్తు ఏర్పాటు చేశారు.

దాబా లో జరిగిన వివా దం పెద్దది కాకుండా అవసరమైన చర్యలు చేపట్టి గ్రామంలో ప్రశాంతమైన వాతావరణాన్ని కొనసాగించే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇటీవల మండల కేంద్రమైన గరిడేప ల్లి లోని దాబాలలో అర్ధరాత్రి దాటిన మ ద్యం అమ్మకాలను కొనసాగిస్తున్నారు. గతం లో కూడా రెండు మూడుసార్లు గొడవలు జరిగినట్లు తెలిసింది. దాబాలలో మద్యం అమ్మకాలు లేకుండా పోలీసులు కఠిన చర్య లు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రాత్రి కూడా 10 గంటల లోపే దాబాలను మూసి వేసే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.