1 August, 2026 | 4:15 PM

Breaking News

కోనరావుపేట మండలంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీల ఏర్పాటు   •   ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జయప్రదం చేయండి   •   తల్లిపాల వారోత్సవాలు   •   బాచ్‌పన్ ఏహెచ్‌పీఎస్ ప్రైమరీ, బీరంగూడలో ఫ్యాన్సీ డ్రస్ పోటీలు   •   మండల సాధారణ సర్వసభ్య సమావేశంలో సమయపాలన పాటించని సర్పంచులు, అధికారులు   •   జనగామను సందర్శించిన హైకోర్టు జడ్జి సూరేపల్లి నందా   •   ఉదయం 11 గంటల నుండి నిలకడగా ప్రవహిస్తున్న గోదావరి వరద   •   రాజంపేటలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన ఆత్రం సుగుణక్క   •   స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి   •   అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు అండగా TWJF   •  

అకాల వర్షానికి నేలకొరిగిన మొక్కజొన్న పంట

22-03-2025 10:40 PM

రాజంపేట,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం, ఆరేపల్లి, బసవన్నపల్లి, అరగొండ గ్రామాలలో నిన్న కురిసినటువంటి వర్షానికి నేలకొరిగిన మొక్కజొన్న పంటలను సంబంధిత క్లస్టర్ ఏఈవోలు శనివారం సందర్శించారు. ఇందులో భాగంగా రాజంపేట మండలంలో  ప్రాథమిక అంచనాగా మొత్తం26  ఎకరాల మొక్కజొన్న పంట నేలకు ఒరిగినట్టు గమనించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఏ శ్రుతి, రాజంపేట మండల ఏఈవోలు రైతులు పాల్గొన్నారు. పంట నష్టాలు గురించి మండల వ్యవసాయ అధికారి ఫీల్డ్ విజిట్ చేసి జరిగిన నష్టాన్ని ఉన్నత అధికారులకు తెలియజేస్తామన్నారు.