6 May, 2026 | 8:03 PM

Breaking News

ఉమామహేశ్వరంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు   •   జనగణన 2027పై అవగాహన కార్యక్రమం   •   జిల్లా కోర్టును సందర్శించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పులి సులోచనరావుకు అభినందనల వెల్లువ   •   పెళ్లి రోజు సందర్భంగా ఎల్లమ్మ, మహంకాళి అమ్మవార్లను దర్శించిన తలసాని దంపతులు   •   జవహర్ నగర్‌లో గృహిణి అదృశ్యం   •   గిరిజన ప్రాంతాలలో అమలు చేస్తున్న కార్యక్రమాల లక్ష్యాలను సాధించాలి   •   శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవానికి ఆహ్వానం అందజేత   •   వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన సదస్సు   •   ఆర్టీసీ సూపర్వైజర్ కాలనీలో ఘనంగా అభయ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన   •  

నగరంలో కుండపోత వర్షం.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం

07-08-2025 07:29 PM

హైదరాబాద్: హైదరాబాద్(Hyderabaad) నగరంలోని పలుచోట్ల భారీ వర్షం కురుస్తుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్‌, నాంపల్లి, మాసబ్‌ట్యాంక్‌, మెహిదీపట్నం, హైటెక్ సిటీ, ఎల్బీ నగర్, నాగోలు, హయత్ నగర్, వనస్థలిపురం, పంజాగుట్ట, హయత్ నగర్, వనస్థలిపురం, అబ్దుల్ పూర్ మెట్ సహా పలు ప్రాంతాల్లో వర్షం భీభత్సంగా పడుతోంది. ఆఫీసుల నుండి ఇంటికి వెళ్ళే సమయం కావడంతో వాహనదారులకు ట్రాఫిక్ సమస్యలు తప్పడం లేదు. సాయంత్రం ప్రారంభమైన వర్షం.. అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండి, సమన్వయంతో పని చేయాలని అధికారులను ఆదేశించారు.