28 June, 2026 | 3:37 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలి

07-08-2025 07:37 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్..

కామారెడ్డి (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్(District Collector Ashish Sangwan) అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కామారెడ్డి పట్టణంలోని రాజానగర్ కాలనీ, గర్గుల్ గ్రామంలో పర్యటించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా బేస్మెట్ వరకు నిర్మాణం పూర్తయిన ఇండ్ల నిర్మాణాలకు బిల్లులు మంజూరు అయ్యాయా..? అని అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని లబ్ధిదారులను అడిగి ఎలాంటి సమస్య రాకుండా ప్రభుత్వం ఉచితంగా ఇసుక, మొరం అందజేస్తదని రవాణా ఖర్చులు పెట్టుకొని వాటిని తీసుకుని వచ్చి నాణ్యతగా ఇల్లు నిర్మించుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.

ఇంటి నిర్మాణం పూర్తయిన, ఇంటి నిర్మాణం వివిధ స్టేజీలను బట్టి  బిల్లులు చెల్లించడం జరుగుతుందని తెలిపారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు  ఇసుక, మొరం, ఇతర నిర్మాణ సాగుమాగ్రికి ఎలాంటి సమస్య తలెత్తకుండా  రెగ్యులర్ గా  పర్యవేక్షించాలని  హౌసింగ్ పీడీ  విజయ్ పాల్ రెడ్డి, కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి లను ఆదేశించారు. మార్కౌట్ చేసి నిర్మాణం ప్రారంభమైన  అన్ని ఇందిరమ్మ ఇండ్లు వేగంగా నిర్మాణం పూర్తయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ నాయక్, టి పి ఓ గిరిధర్, ఆర్ ఐ రవి గోపాల్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది, మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.