03-02-2026 05:50:49 PM
సుల్తానాబాద్,(విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం కప్ క్రీడా పోటీలు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం, మున్సిపాలిటీ స్థాయి పోటీలు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీవో దివ్యదర్శనరావు, మున్సిపల్ కమిషనర్ రమేష్, మండల విద్యాశాఖ అధికారి ఆరెపల్లి రాజయ్య, సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు ముస్త్యాల రవీందర్ హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యువత శారీరకంగా దృఢంగా ఉండేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, సీఎం కప్ ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రతిభకు మంచి వేదిక లభిస్తోందని పేర్కొన్నారు. క్రీడలతో క్రమశిక్షణ, ఐక్యత పెరుగుతాయని తెలిపారు. ఈ పోటీల్లో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్ వంటి విభాగాల్లో పోటీలు నిర్వహించారు.
పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. గెలుపొందిన క్రీడాకారుల కు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎస్ జి ఎఫ్ కార్యదర్శి తాండ్ర ప్రణయ్, కందుకూరి ప్రకాష్ రావు (పెద్దన్న), వ్యాయామ ఉపాధ్యాయులు ప్రసాద్, సంధ్య, శ్రీవాణి,ఆసియా, సరోజ,స్వప్న,వెంకటేష్, మధుకర్, సంపత్, సత్యం, ఇక్బాల్, అజ్జు, రంజిత్, మమత విద్యార్థు లు పాల్గొన్నారు.