calender_icon.png 3 February, 2026 | 8:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనావాసాల్లో పందుల సంచారం సహించేది లేదు

03-02-2026 05:47:38 PM

అచ్చంపేట పురపాలిక కమిషనర్ మురళి

అచ్చంపేట: ప్రజలకు ఇబ్బందులు కలిగేలా జనావాసాల్లో పందుల సంచారం ఉంటే చర్యలు తప్పవని అచ్చంపేట పురపాలిక కమిషనర్ మురళి హెచ్చరించారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో పందుల పెంపకందారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మార్కెట్లో రైతుల పండించిన ధాన్యం ఆరబోస్తే వాటిని పందులు తింటున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయని, దీని వలన రైతులకు తీరని అన్యాయం జరుగుతోందని చెప్పారు.

అలాగే హాస్టల్స్, కొన్ని చోట్లా జనావాసాల్లోకి పందుల సంచారం పెరిగినట్లు ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజల ఇళ్ల సమీపంలోనే పందుల షెడ్లను ఏర్పాటు చేశారని, అలాంటి ఉంటే పట్టణానికి దూరంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వీలైనంత త్వరగా పందుల వలన కలిగే ఇబ్బందులు రాకుండా చూడాలని లేకుంటే పురపాలిక నుంచి తామే కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు. శానిటరీ ఇనిస్పెక్టర్ గణేష్, కౌన్సిలర్లు శివ, రమేశ్ రావు తదితరులు పాల్గొన్నారు.