03-02-2026 06:11:44 PM
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ హంటర్ రోడ్ లోని కాకతీయ జూ పార్క్ లో తెల్ల పులి (15) మృతి చెందింది. వృద్ధాప్య సమస్యలు, గుండె పోటు రావడంతో మృతి చెందినట్లు అటవీశాఖ అధికారి మయూరి వెల్లడించారు. సాధారణంగా పులుల జీవితకాలం 14 ఏళ్లు కాగా, ఈ పులి అంతకంటే ఎక్కువ కాలం జీవించిందని పేర్కొన్నారు. రెండు నెలలుగా వైద్యులు చికిత్స అందించిన ఫలితం లేకపోయింది. నిబంధనల ప్రకారం పోస్ట్ మార్టం నిర్వహించి, ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు తెలిపారు.