15 July, 2026 | 3:28 AM

విభజన హామీలను నెరవేర్చాలని ప్రధాని మోడీని కోరాం : భట్టి

04-07-2024 08:41 PM

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిశామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గోదావరి పరిసరాల్లోని బొగ్గు గనులను వేలం లేకుండా సింగరేణికి కేటాయించాలని ప్రధానిని కోరినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రానికి ఐఐఎం ఇవ్వాలని, ఐటీఐఆర్ ప్రాజెక్టును పునరుద్ధరించాలని అడిగామన్నారు.

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కృషి చేయాలని, తెలంగాణకు 25 లక్షల ఇళ్లు మంజూరు చేయాని ప్రధానికి విన్నవించామని భట్టీ పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో నవోదయ స్కూల్ ఏర్పాటు చేయాలని, విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని, రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని భట్టి విక్రమార్క చెప్పామన్నారు.