15 July, 2026 | 3:17 AM

ఎంఎల్ఏ రాజశేఖర్ రెడ్డికి చేదు అనుభవం

04-07-2024 09:17 PM

మేడ్చల్: మాల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంఎల్ఏ రాజశేఖర్ రెడ్డికి గురువారం చేదు అనుభవం ఎదురైంది. మౌలాలీ ఆర్టీసీ కాలనిలో కొన్ని నెలలుగా మెయిన్ రోడ్ రిపేర్ పనులును జరగకపోవడంతో స్థానిక ప్రజలు ఎంఎల్ఏపై తిరగబడ్డారు. ఇన్నాళ్లు రోడ్ మరమ్మతులు చేయకుండా గాలికి వదిలేశారని, పలుమార్ల పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టినా ఫలితం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంఎల్ఏని నిలదీసిన వారిపై మరో వర్గం వారు దాడికి పాల్పడారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పాడింది. అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.