15 July, 2026 | 3:41 AM

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పుంజుకున్నది : రేవంత్‌ రెడ్డి ట్వీట్

04-07-2024 08:08 PM

హైదరాబాద్: రియల్ ఎస్టేట్ రంగం గత ఆరు నెలలుగా హైదరాబాద్‌లో పుంజుకున్నదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. దేశీయ, అంతర్జాతీయ ఆఫీస్ స్పేస్ లీజ్ రంగంలో 40 శాతం వృద్దిలో దూసుకెళ్లుతోందని రేవంత్‌రెడి ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఈ ఏడాదిలో మొత్తం 50 లక్షల  చదరపు అడుగల స్థలం  అద్దెకు వెళ్లిందని, గత ఏడాదితో పోలిస్తే ఈసారి అద్దె లావాదేవీల్లో 40 శాతం వృద్ధి కనిపించిందన్నారు. ఈ విషయాన్ని  స్థిరాస్తీ సేవల సంస్థ కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ నివేదిక వెల్లడించిందని సీఎం తెలిపారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ ఇమెజ్‌ను పునర్నిర్మిస్తామని సీఎం తెలిపారు. ఈ ప్రయాణంలో ప్రతీ ఒక్కరికి అవకాశాలను సృష్టిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

https://twitter.com/revanth_anumula/status/1808728727188295989?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1808728727188295989%7Ctwgr%5Ecc69a8fbf1beefc8a1b1333b9fd2684830969f37%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.newsmeter.in%2Ftelangana%2Fboom-in-hyderabad-real-estate-market-in-past-6-months-cm-revanth-reddy-731912