24 August, 2026 | 11:34 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

భట్టి విక్రమార్కకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

15-06-2026 12:57 PM

హైదరాబాద్: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి(Telangana Deputy Chief Minister) మల్లు భట్టి విక్రమార్కకు ఆయన 65వ పుట్టినరోజు(Mallu Bhatti Vikramarka birthday) సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, తెలంగాణ ప్రజలకు సేవలందించడంలో అత్యుత్తమంగా రాణించాలని ఆకాంక్షిస్తున్నట్లు ముఖ్యమంత్రి తన 'X' పోస్టులో పేర్కొన్నారు. తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా కూడా భట్టి విక్రమార్కకు ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఉప ముఖ్యమంత్రి సహచర మంత్రులు, ఇతర నాయకులు కూడా ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. సోమాజిగూడలోని ప్రజా భవన్‌లో పలువురు మంత్రులు, నాయకులు ఉప ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Duddilla Sridhar Babu), తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్రమోహన్ ఉన్నారు.