04-12-2025 04:35:33 PM
హిందూ దేవతలపైన సీఎం రేవంత్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ..
బాన్సువాడలో సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనం..
బాన్సువాడ (విజయక్రాంతి): హిందూ దేవతలపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గురువారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారూ. ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు కొనాల గంగారెడ్డి మాట్లాడుతూ.. హిందువులకు సంబంధించిన దేవుళ్లను అవహేళన చేసి మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజులు త్వరలో ఉన్నాయని, ఎన్నికలకు ముందు తానే గొప్ప హిందువులంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు.
అధికారంలోకి రాగానే హిందువుల మనోభావాలను అవహేళన చేస్తున్నారని.. సీఎం మాట్లాడిన వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాలని హిందువులకు బహిరంగకు క్షమాపణ చెప్పాలని లేనిచో స్థానిక ఎలక్షన్లలో హిందువులు తగిన బుద్ధి చెబుతారని బిజెపి నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు చిదుర సాయిలు మాజీ అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్ బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి చిరంజీవి ఓబిసి జిల్లా ప్రధాన కార్యదర్శి చీకట్ల రాజు బిజెపి జిల్లా కౌన్సిలింగ్ నెంబర్ తుత్తి ప్రసాద్ బిజెపి పట్టణ ఉపాధ్యక్షులు సిద్ది బాలరాజ్ అనిల్ బిజెపి నాయకులు పాశం భాస్కర్ రెడ్డి విశాల్. తదితరులు పాల్గొన్నారు.