calender_icon.png 4 December, 2025 | 5:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగిరెడ్డిపేట ఎంపీడీవో, ఎంపిఓలపై సస్పెన్షన్ వేటు

04-12-2025 04:37:23 PM

నామినేషన్ల వివరాలు అందజేయడంలో నిర్లక్ష్యం

ఆగ్రహం వ్యక్తం చేస్తూ సస్పెండ్ చేసిన కలెక్టర్

నాగిరెడ్డిపేట్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం ఎంపీడీవో, ఎంపీఓలు సస్పెన్షన్కు గురయ్యారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల వివరాలను అందించడంలో నాగిరెడ్డిపేట్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి లలిత కుమారి, మండల పంచాయతీ అధికారి ప్రభాకర్ చారిలు నిర్లక్ష్యం వహించినందున జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సంగ్వన్ గురువారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

వివరాలోకి వెళితే నాగిరెడ్డిపేట మండలంలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 30వ తేదీ డిసెంబర్ ఒకటి రెండవ తేదీలలో మూడు రోజులపాటు సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు దాఖలు అయ్యాయి.అయితే ఆఇద్దరు అధికారులు జిల్లా అధికారులకు సకాలంలో నామినేషన్ల వివరాలు అందించడంలో నిర్లక్ష్యంతో పాటు అందుబాటులో ఉండకపోవడం ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఎల్లారెడ్డి డిఎల్పిఓ సురేందర్ ఫిర్యాదు మేరకు ఆర్డిఓ పార్థసారధి రెడ్డి విచారణ జరిపి ఉన్నత అధికారులకు నివేదిక అందజేశారు.దానితో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆశిష్ సంగ్వన్ నాగిరెడ్డిపేట్ మండల ఎంపీడీవో లలిత కుమారి,ఎంపీవో శ్రీనివాసులను సస్పెండ్ చేశారు.