11 May, 2026 | 11:15 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

ప్రజా ప్రభుత్వంలో క్రీడలకు అధిక ప్రాధాన్యం: సీఎం రేవంత్ రెడ్డి

29-08-2024 10:58 AM

హైదరాబాద్: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడాకారులు, క్రీడాభిమానులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని 'జాతీయ క్రీడా దినోత్సవం'గా జరుపుకోవడం గర్వకారణమన్నారు. "నా దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం నా కర్తవ్యం" అన్న ధ్యాన్ చంద్ మాటల స్ఫూర్తితో ప్రజాప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని, అందులో భాగంగానే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని నెలకొల్పుతున్నామని గుర్తుచేశారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటేలా ఈ వర్సిటీలో ఒలింపిక్ స్థాయి సౌకర్యాలు, శిక్షణ అందించే ఏర్పాట్లు చేస్తున్నామని ముఖ్యమంత్రి ఒక సందేశంలో పేర్కొన్నారు.